ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిన టీ స్టాల్ వ్యాపారి.. ప్లాస్టిక్ టీ కప్పుల స్థానంలో బిస్కెట్లతోనే టీ కప్పులను తయారు చేయించి వాటిలోనే వేడివేడి చాయ్‌ని అందిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనకు రుచి తోడవ్వడంతో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. తమిళనాడులోని మదురైకి చెందిన వివేక్ సబాపతి.. ఆర్ఎస్ పాతీ నీల్గిరి పేరుతో టీ స్టాల్‌ను కొనసాగిస్తున్నారు. పర్యావరణహితమైన ఈ టీ స్టాల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.