మొబైల్ టిఫిన్ సెంటర్లను ప్రారంభించనున్న తెలంగాణ సర్కార్..ఎస్సీ కార్పొరేషన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగా 40 మందికి మొబైల్ టిఫిన్ సెంటర్లను మంజూరు చేసింది. బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఈ టిఫిన్ సెంటర్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ పాత పథకాల స్థానంలో కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా మొబైల్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.