ఉత్తర ప్రదేశ్ లో దారుణం.. పెళ్లి రోజే పెళ్లి కూతురుకు మొదలైన కష్టాలు..పార్టీలో మందు అందరికీ సరిపోలేదు పెళ్లి కొడుకు రాగానే వారంతా ఘర్షణకు దిగారు.. అయితే వారందరూ కలిసి మందు సరిపోకుండా తెస్తవా అంటూ ఆగ్రహానికి గురయ్యారు. ఆ చిన్నపాటి ఘర్షణ కాస్త పెద్దగా అయింది.. ఎంతో ఆశగా వచ్చిన పెళ్లి కొడుకుకు కూడా మందు లేకపోవడంతో ఆ గొడవ కాస్త మరింత పెరిగింది. మందు తెప్పించేందుకు నిరాకరించాడని ఆగ్రహం చెందిన స్నేహితుడు రాంఖిలాడి పెళ్లికి పిలిచిన వరుడినే కత్తితో పొడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బబ్లూని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.