ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దారుణ ఘటన వెలుగు చూసింది. మీరట్ లోని సందీప్ కుమార్ అనే యువకుడు ఢిల్లీ పహర్ గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్ లో తాను యూపీ పోలీసు అధికారినంటూ చెప్పి ఓ మహిళపై అత్యాచారం జరిపినట్లు తేలింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ అత్యాచార బాగోతంపై తాము నిందితుడు సందీప్ కుమార్ పై కేసు నమోదు చేశామని డీసీపీ సంజయ్ భాటియా చెప్పారు.