ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకం తాత్కాలికంగా వాయిదా.. సరుకులను పంపిణీ చేసే వాహనాలు రాష్ట్రంలోకి రాకపోవడంతో ఈ పథకం ప్రారంభం వాయిదా పడింది. జిల్లాలో 19 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 2,659 చౌక దుకాణాలకు సరకులు చేరవేస్తున్నారు. ఈ విషయాన్ని పౌర సరఫరాల అధికారి పి.ప్రసాదరావు ఇంటింటి సరకుల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఇకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక దుకాణాలకు జనవరి సరకులు సరఫరాచేస్తున్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మిరెడ్డి తెలిపారు...