చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటేచాలు బతుకంతా దాంతోనే అన్నట్టు గడిపేస్తున్నారు. కారణం ఏదైనా కావొచ్చు కానీ, దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఒకరోజులో సగటున ఏడుగంటలు ఫోన్ను వినియోగిస్తున్నట్టు సైబర్ మీడియా రిసెర్చ్ (సీఎంఆర్) ఫర్ వివో సంస్థ సర్వేలో తేలింది. ఈ సంస్థ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు దేశంలోని 8 నగరాల్లో 15-45 ఏండ్ల మధ్య వయసుకు చెందిన 2,000 మంది అభిప్రాయాలను సేకరించింది.. అంతేకాదు వాళ్ళు బాహ్య ప్రపంచం కన్నా కూడా డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా విహరిస్తున్న ట్లుగా తేల్చి చెప్పారు.