హైదరాబాద్ లో రేవ్ పార్టీల పేరుతో రచ్చ చేస్తున్న యువత..కీసరలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రీడ్జ్ రిసార్టులోని ఓ విల్లాలో బెస్ట్ క్రాప్ విత్తన సంస్థ మేనేజర్ ఆదివారం రాత్రి సన్నిహితుల కోసం రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించి ఆరుగురు యువతులను, 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన డీలర్లు రేపు పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.