తమిళనాడులో గురువారం జరిగే సంక్రాంతి వేడుకలకు పలువురు జాతీయ నేతలు హాజరుకానున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు తమిళనాడులో జరిగే సంప్రదాయ పండుగకు హాజరవుతుండడంతో అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.