దేశ వ్యాప్తంగా చికెన్ ధరలు పడిపోయిన సంగతి తెలిసిందే..అయితే ఇప్పుడు బర్డ్ ప్లూ కారణంగా కోడి మాంసం కొనడం మాట అటుంచితే ఆ పేరు వినాలంటే భయంతో వణికిపోతున్నారు.నాటు కోడి రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి.ఒక్కో కోడికి రూ.3000 నుండి 10 వేల వరకు కూడా ఉంది. పందెం కోళ్లను కొనుగోలు చేసేందుకు ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో రేట్లు మాములుగా లేవు. అక్కడ కోడి పందాలు ఎక్కువే .. అంతకన్నా ఎక్కువగా నాటు కోడి తినేవాళ్ళు ఎక్కువగా ఉంటారు.