గడిచిన ఏడాదిలో పండగ మూడు రోజుల్లో కలిపి 4,38,729 మద్యం, బీరు కేసులు అమ్ముడయ్యాయి. అయితే ఈ ఏడాది జనవరి 13, 14, 15 తేదీల్లో 4,02,203 మద్యం, బీరు కేసులే అమ్ము డు పోయాయని తెలుస్తోంది.36,526 మద్యం కేసులు అమ్ముడు పోయాయట. మరో విషయమేంటంటే గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఆంధ్రాలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత స్థానాల్లో విశాఖ, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలున్నాయి. అతి తక్కువగా అమ్మకాలు జరిగిన జిల్లాలో గతం మాదిరిగానే అనంతపురం ఉంది.