13 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో చోటు చేసుకుంది. ఐదు రోజుల వ్యవధిలో కామాంధులు పలుసార్లు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. జనవరి 4 వ తేదీన ఓ యువకుడు కిడ్నాప్ చేశారు. అతను లైంగిక దాడి చేశాడు. తర్వాత అతని ఫ్రెండ్స్ ఆరుగురు కూడా ఆమె పై దాడి చేసి పశు వాంఛన తీర్చుకున్నారు. 5 న బాలికను వదిలిపెట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.