అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. బయటకు టిప్ టాప్‌గా కనిపిస్తాడు.. కానీ చేసేవి మాత్రం పక్కా వెధవ పనులు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను టార్గెట్‌గా చేసుకుంటాడు. అదును చూసి మెడలో ఉన్న చైన్లను కొట్టేస్తాడు. కానీ, అన్ని వేళలు ఒకేలా ఉండవు కదా.. తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఈ చైన్ స్నాచర్ ఆటకట్టించారు. సాఫ్ట్వేర్ రామకృష్ణను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.