బీహార్ లోని ఓ ఎంబీఏ విద్యార్థి ఒక వైపు చదువుకుంటూ మరో వైపు నిషేధించిన మద్యాన్ని అమ్ముతూ లాభాలను ఆర్జిస్తున్నాడు. లగ్జరీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ,ఎక్సైజ్ అధికారులు అతని ఇంటిపై దాడి చేశారు.రూ.21 లక్షల విలువైన 1,100 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అతుల్ సింగ్ రోజుకు రూ.9 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నట్టు పత్రకార్నగర్ పోలీస్ స్టేషన్ అధికారి మనోరంజన్ భారతి తెలిపారు. అతడి వద్ద నుంచి బ్యాంకు పాస్‌బుక్‌తో పాటు సంబంధిత పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.