సిద్దిపేట లోని మహిళా సంఘం సభ్యులు 20 మంది రూ.2 లక్షలు జమ చేశారు. సర్పంచ్ వంగ లక్ష్మి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లతో మాట్లాడి రూ.10 లక్షల రుణం ఇప్పించారు. ఇలా మొత్తం రూ.13 లక్షల్లో ముందుగా రూ.3 లక్షలు పెట్టి కందులను పప్పుగా మార్చే మిషన్లు, ప్యాకింగ్ కవర్లు, ఇతర పనిముట్లు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బుతో గ్రామంలోని రైతుల వద్ద కందులను క్వింటాల్‌కు రూ.5,800 చెల్లించి కొనుగోలు చేశారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కందులను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్ధిక మంత్రి హరీష్ రావు లు ప్రశంసలు కురిపిస్తున్నారు.