ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడమే కాక, వారికి రుణాలు అందించేందుకు తన ఆస్తిని బ్యాం కుకు తాకట్టు పెట్టారు. దీంతో ఇప్పుడు వారికి రుణాలు సులభంగా అందనున్నాయి. గురువారం సిద్దిపేటలో హరీశ్‌రావు చేతుల మీదుగా 850 మంది ఆటోవాలాలకు రుణాలు, డ్రెస్సులు అందించనున్నారు.