రైతుల కోసం కొత్త పథకాలను అమలు చేస్తున్న కేంద్రం ఇప్పుడు రైతులకు భారీ షాక్ ఇచ్చింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా కొత్త ఆలోచన చేసింది. ఈ మేరకు రైతులకు చేదు వార్తను అందించింది. సబ్సిడీ పై రైతులకు అందిస్తున్న ఎరువుల పై పరిమితులు విధించింది. విషయానికొస్తే.. సబ్సిడీ పై కొంటున్న యూరియా పై కోత కోసింది. ఇక మీదట రైతులు ఎన్నంటే అన్ని యూరియా బస్తాలు కొనే అవకాశంలేదు.