పాత నోట్ల స్థానంలో రూ. 100, రూ. 10, రూ. 5 నోట్ల స్థానంలో కొత్త నోట్లు రావడం గమనార్హం.మరోవైపు, 10 రూపాయల నాణేన్ని తీసుకొచ్చి 15 ఏళ్లు అయింది. ఈ నాణేన్ని రద్దు చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో వ్యాపారులు ఈ నాణేన్ని తీసుకునేందుకు ఇప్పటికీ అంగీకరించడం లేదు. ఈ విషయంలో రిజర్వు బ్యాంకు పలుమార్లు వివరణ ఇచ్చింది. ఇప్పుడు పాత నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తలు ప్రజలను మరింత ఇరకాటంలో పడేశాయి.ఆర్బీఐకి ఇప్పుడు ఇది మరో కొత్త తలనొప్పిగా మారింది.ఈ విషయం పై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన ఇస్తుందో చూడాలి..