సోడా లేదా కూల్ డ్రింక్స్‌తో మద్యం సేవించవద్దు, మద్యం తో ఆయిల్ పదార్థాలను తీసుకోకూడదు, జీడిపప్పు లేదా వేరుశెనగ తినకూడదు,స్వీట్స్, పాల ఉత్పత్తులను తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మద్యంతో తీపి తింటే మత్తును రెట్టింపు చేస్తుంది. దీనితో, వ్యక్తి తన నియంత్రణ కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి.ఇకపోతే పాల ఉత్పత్తులతో తయారైన వస్తువులను మద్యం సేవించే సమయంలో లేదా ఆ తర్వాత ఒక గంట సమయం వరకు తినకూడదు. పాలతో చేసిన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.