ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీ యుద్ధం ప్రకటించింది.డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధుల నియంత్రణకు యంత్రాంగం వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నది. నెలవారీగా చేపట్టే పనులకు తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకొని అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలను వేగవంతం చేశారు. " ఆపరేషన్ దోమ" పేరిట ప్రతి వారం యాంటీ లార్వా కార్యక్రమం చేపట్టనున్నారు