ఇద్దరు అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిస్సందేహంగా కోర్టు ధిక్కారమేనని, తక్షణం ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం డిమాండ్ చేశారు. మూడున్నర లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవడానికి కారణమైన అధికారులను మంత్రి వెనకేసుకొని వస్తున్నారని, న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులను జీర్ణించుకోలేక మాట్లాడుతున్న ఆయన శిక్షకు అర్హుడేనని మీడియాతో అన్నారు. జగన్ ప్రభుత్వం విధి లేని పరిస్థితుల్లోనే ఎన్నికలకు సిద్ధమైందని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.