చిత్తూరులో ఏకగ్రీవాన్ని టిడిపి నేతలు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అనేక చోట్ల అభ్యర్థులు లేని పరిస్థితి ఉండడంతో వివాదాలను సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పాత పరిచయాలను అడ్డంపెట్టుకుని టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన నాయకులను ప్రలోభపెడుతున్నారు.ముఖ్యంగా కుప్పం, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకర్గాల్లో టీడీపీ నేతలు పరువు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ దాదాపు ఖాళీ అయిన విషయం తెలిసిందే...