కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కు వారి ఓట్లు పెద్దగా పడలేదు. గత ఎన్నికల్లో కాపులంతా వైసీపీకి ఓట్లు గుద్దేశారు. ఇందుకు ప్రత్యేక్ష ఉదాహరణ భీమవరం, గాజువాకలో పవన్ ఓటమి. ఇప్పుడు కాపు నేతలతో పవన్ భేటీ అవ్వనున్నారు.రాష్ట్ర అధ్యక్షుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అవడం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి గాలం వేయడంతో బీజేపీ-జనసేన కాపులను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది