ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య మరో వివాదం తలెత్తినట్లు సమాచారం. ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి రవిచంద్రను నియమిస్తూ నిన్న సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపారు. ఆ తర్వాత రవిచంద్రన్ను వైద్య ఆరోగ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.