ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వారి స్టైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు- నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తోడు దొంగలు అని పెద్దిరెడ్డి ఫైరయ్యారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని పెద్దిరెడ్డి అడిగారు. టీడీపీ, చంద్రబాబు నాయుడుపై ఎందుకు కనీసం కామెంట్ చేయడం లేదని అని నిమ్మగడ్డను ప్రశ్నించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలదీశారు