శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె పంచాయతీ బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ పంచాయతీలో బీసీ మహిళ ఒక్కరే ఉన్నారు. ఆమె పేరు ఖాదర్బి. మిగిలిన ఓటర్లంతా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఖాదర్బి ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. అయితే టీడీపీ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చెలికం పాపిరెడ్డి ఎన్నికలు నిర్వహించాలని పై ఎత్తులు వేస్తున్నారు.రెండు రోజుల క్రితం కార్వేటినగరం, ఎస్ఆర్పురం మండలాల్లో టీడీపీ శ్రేణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్లు చేసి రెచ్చగొట్టారు. ఆపై రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో, టీడీపీ గ్రూపులో షేర్చేసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు దాదాగిరి చేస్తున్నారని తెలుస్తోంది.మరి ఈ విషయం పై రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశం గా మారింది.