ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. పంచాయితీ ఎన్నికల తొలి దశ నామినేషన్ ప్రక్రియ నిన్నటి తో ముగిసిపోయింది. నిన్న నామినేషన్లు వేయడానికి చివరి రోజు కావడంతో నేతలు హోరా హోరీగా ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకున్నారు. నువ్వా నేనా అంటూ గొడవలకు దిగుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో మాత్రం నామినేషన్లు జరిగే ప్రాంతాల్లో మాత్రం నేతలు కాస్త దూకుడును ప్రదర్శించారు. ఇక ఈ వ్యవహారం చిత్తూరు లో మాత్రం ఎక్కువగా ఉంది.పంచాయతీ ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది.