చాలా మందికి ఉదయం లేవగానే ఫోన్ చూడటం అలవాటు. రాత్రంతా దానితోనే జాగారం చేసినా.. పొద్దున లేవగానే ఫోన్ లో ఇంటర్నెట్ ఆన్ చేసి సామాజిక మాధ్యమాల్లో దూకాల్సిందే. అయితే ఇది మనం మాత్రమే చేస్తున్నామనుకుంటాం. కాదు. ఇలా చేసేవాళ్లు చాలా మందే ఉన్నారట. ఉదయం లేవగానే పనులన్నీ మానేసి సోషల్ మీడియాలో ఉండేవారందరూ ఆ అలవాటును మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు బదులు మైండ్ ను రీఫ్రెష్ చేసుకోవాలని.. అందుకుగానూ ధ్యానం, వ్యాయామం వంటివి చేయాలని నిపుణులు అంటున్నారు.