రెండో విడత నామినేషన్ల వంతు వచ్చింది. రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే 3,335 గ్రామాల్లో మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఆయా గ్రామాల రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేసి.. ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపడతారు. 3,335 గ్రామ సర్పంచ్ పదవులతో పాటు ఆ గ్రామాల పరిధిలో గల 33,632 వార్డు పదవులకు కూడా అదే సమయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది.