చిత్తూరులో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నామినేషన్లు వేస్తున్న కేంద్రాల దగ్గర ఉన్న అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు టీడీపీ మండల నేత సహా ఏడుగురిపై అట్రాసిటీ కేసులు కూడా నమోదు అయ్యాయి. జిల్లాలలోని చంద్రగిరి మండలంలో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా మండల మేజిస్ట్రేట్ కార్యాలయంలోనే తహసీల్దార్‌పై దాడికి ప్రయత్నించారు. దళితులైన మహిళా అధికారులను కులం పేరుతో దూషించారు..