ఆంధ్ర ప్రదేశ్ లో మొన్నటివరకు దేవాలయాలపై దాడులు.. విగ్రహాల విధ్వంసం ఎంతలా చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. అయితే.. దాడుల్లో ఎవరెవరి ప్రమేయం ఉందో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ.. అసలు నిందితులెవరనేది వెలుగులోకి వస్తోంది. రాజకీయ కారణాలతోనే విగ్రహాల విధ్వంసకాండ సాగిందనేది తెలిసిపోయింది. కొన్ని దాడులు ఏమో స్వప్రయోజనాల కోసం ఆలయ సిబ్బందులు చేస్తే.. మరికొన్ని మాత్రం టీడీపీ నేతలు చేశారని పోలీసులు రుజువు చేశారు. ఈ దేవాలయ దాడులలో కుట్రలు బయటపడటంతో దొంగల ముఠా సైలెంట్ అయ్యిందని వైసీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు