ఏపి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాబు ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీరు రోజు రోజుకు దారుణంగా తయారవుతుందని ఆరోపించారు. పథకాలు అంటూ ప్రజలను దోచుకుంటున్నారు అని అన్నారు.ఇక ప్రజలు జగన్ ఆగడాలకు చెక్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం రాజారెడ్డి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.