బంగారపు ఇల్లు..కుర్చీలు, బెంచీలు, సోఫాలు అన్నీ ధగధగా మెరిసిపోతుంటాయి. షాండియర్ లైట్ల వెలుగులో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 6,997 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవంతి రష్యాలోని ఈర్కుత్స్క్ నగరంలో ఉంది.రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ భవంతిలో ఐదు బెడ్రూములు, డ్రెస్సింగ్ రూమ్లు, విశాలమైన హాలు, ప్రైవేట్ బాత్రూమ్లు, కారిడార్, పేద్ద వంటగది, డైనింగ్ హాల్ ఇలా అన్నింటిలో బంగారు తాపడంతో చేసిన వస్తువులు అమర్చి ఉంటాయి.