ఏపి లో ఎన్నికల జోరు స్పీడ్ అందుకుంది. ఎన్నికల రెండో విడత నామినేషన్ ఈరోజు ముగియనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని నామినేషన్లు వేశారు అనే అంశం అందరినీ ఆలోచనలో పడేసింది..ఈరోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్లు ముగుస్తాయి. ఈ నెల 13 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా కడప జిల్లాలో పచ్చ నేతల ఆగడాలు మితి మీరుతున్నాయి. ఒక వైపు మద్యం పోస్తూ, మరో వైపు దాడులు, ఇంకా డబ్బుల పంపిణీ చేస్తూ, చేయిస్తూ ప్రజలను ప్రలోబాలకు గురిచేస్తున్నారని సమాచారం..