రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను రద్దు చేశారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని, టీడీపీ అధినేత మేనిఫెస్టోను ప్రకటించడం, ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ అధికార పార్టీ నేతలు ఎస్ఈసీ కి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న ఎస్ఈసీ వెంటనే వివరణ ఇవ్వాలంటూ టీడీపీని కోరింది.