పంచాయితీ ఎన్నికల ఏకగ్రీవాల విషయంలో వైకాపా అంచనాలు తలక్రిందులు అయ్యాయని తెలుస్తుంది. తొలివిడతలో 1315 పంచాయతీలుకు ఎన్నికలు జరగనుండగా.. వీటిలో 478 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 96 ఏకగ్రీవం కాగా, గుంటూరు జిల్లాలో 67, కర్నూలు జిల్లాలో 54, కడప జిల్లాలో 46, పశ్చిమగోదావరి జిల్లాలో 40, తూర్పుగోదావరి జిల్లాలో 28, శ్రీకాకుళం 34, విశాఖ పట్నం 32, కృష్ణా 20, ప్రకాశం 16, నెల్లూరు 14, అనంతపురం జిల్లాలో 6 ఏకగ్రీవమయ్యాయి.