జగనోరి మంత్రులు మాత్రం ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నా కూడా నిమ్మగడ్డ పై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్ ప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.ఓటు నమోదు చేసుకోవడం చేత కాని వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా ఉండటం తమ దౌర్భాగ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తన పరిధిలోని అధికారాలపై లెక్చర్లు దంచికొట్టే నిమ్మగడ్డకు ఓటు ఎలా, ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలీకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఎస్ఈసీని నిలదీశారు.