చిత్తూరులో టీడీపీ నేతల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. రెబల్స్‌ను రెచ్చగొట్టి, వెనకాల నామినేషన్లు తిరస్కరించారని గొడవకు దిగి హైడ్రామాలకు తెర లేపారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. జిల్లాల్లోని మండలంలోని కొండామారిపల్లె, రామాచార్లపల్లె పంచాయతీల సర్పంచ్ పదవులకు టీడీపీ రెబల్ అభ్యర్థులుగా సరస్వతి, ఉమామహేశ్వరి, చెడే పుష్ప రెండు రోజుల క్రితం నామినేషన్లను దాఖలు చేశారు. నిన్న నామినేషన్ల పరిశీలన సందర్భంగా కొండామారిపల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఉమామహేశ్వరి గ్రామానికి ఆశా వర్కర్‌గా పనిచేస్తోందంటూ గొడవకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.