చిత్తూరులో ఎన్నికల వేడి నానాటికీ పెరుగుతుంది. సొంత జిల్లాల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో నానా రభస చేస్తున్నారు. కులం పేరుతో గొడవలు, డబ్బు ఆశ చూపించి వారిలో వారిని కొట్టుకొనెలా చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరులోని పలు మండలాల్లో నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులను అడ్డుకున్నారు. మరి కొన్ని చోట్ల నామినేషన్లు వేస్తే చాలు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇక సొంత జిల్లాలో పరువు పోకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు సర్పంచ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.