నిమ్మగడ్డ తీరుపై కొందరు నేతలు కార్యకర్తలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రవర్తన కోటలు దాటుందని అందరూ అంటున్నారు. నిమ్మగడ్డ ప్రవర్తన సరిగ్గా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు.పంచాయతీ ఎన్నికల్లో రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడినా, గీతదాటి ఏకపక్షంగా వ్యవహరించే వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని అన్నారు.