సినీనటిగా మంచి అవకాశాలు వస్తాయని నమ్మబలుకుతూ యువతులపై పోర్న్ వీడియోలను చిత్రీకరిస్తున్న ముఠా ఆగడాలు వెలుగుచూశాయి. మలద్ ప్రాంతంలోని మథ్ ఐలాండ్‌లో ఓ బంగళా నుంచి లైవ్ పోర్న్ వీడియోలను చిత్రీకరిస్తున్న ముఠా గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. ఈ రాకెట్‌కు సంబంధించి ప్రొడక్షన్ హౌస్‌కు చెందిన ఇద్దరు మహిళలు సహా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఫోటో గ్రాఫర్, మరొకరు గ్రాఫిక్ డిజైనర్ గా ఉన్నారని పోలీసులు తెలిపారు.