పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల ఏకగ్రీవమైన పంచాయతీలను తాను అనుమతి ఇచ్చేవరకు అధికారికంగా ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ఆదేశాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ తన మంత్రదండం పనిచేయడం లేదనే అక్కసుతోనే చిత్తూరు,గుంటూరు కలెక్టర్లను మార్పించాడు నిమ్మగడ్డ. తను సెలెక్ట్ చేసిన వారే కొత్త కలెక్టర్లుగా వచ్చినా ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలు భారీగా జరగడంతో మైండ్ బ్లాక్ అయింది. బాబును ఊరడించేందుకు ఫలితాలను హోల్డ్ లో పెట్టించాడు.' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.