చిత్తూరు జిల్లా, పాకాల మండలంలోని దామలచెరువు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మ్యాంగో మార్కెట్ ఇక్కడే ఉంది..అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు ఇతర వ్యాపార కేంద్రాలు చాలానే ఉన్నాయి. దామలచెరువు పంచాయతీకీ మండల కేంద్రమైన పాకాలకు మించిన ఆదాయం ఉంది. అయినా 30 ఏళ్లకు నుంచి సర్పంచ్ లేడట. అక్కడ 47 గ్రామాలు సుమారు 10 వేలకు పైగా జనాభా ఉన్నా కూడా ఎన్నికలకు నోచుకొకపోవడం విశేషం. ప్రజా ప్రతినిధులకు దూరంగా ఉంది. అధికారుల పాలన, దయతో కాలం నడుస్తోంది.ఈ నెల 10 నుంచి నామినేషన్లు ప్రక్రియ మొదలు కానున్నంది. ఇకనైనా పంచాయతీ అభివృద్ధి బాట పడుతుందనే ఆశతో 21న ఎన్నికలలో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తిగాఎదురుచూస్తున్నారు.. మరి అలాంటి ప్రాంతాలను నాయకులు స్వార్థంతో ఎలా మారుస్తారో చూడాలి..