ముచ్చుకోటకు చెందిన టీడీపీ మద్దతుదారు సర్పంచ్ స్థానానికి ఆదివారం నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి తమవెంట వచ్చే వారికి మద్యం, బిర్యానీ ప్యాకెట్ ఇస్తామంటూ ఆయన అనుచరులు ప్రలోభపెట్టారు. ముసలయ్య కూడా ఈ కార్యక్రమానికి వచ్చాడు. ఆ తర్వాత ఓ టీడీపీ నేత తోటలో అందరితో కలిసి మద్యం తాగాడు. పీకలదాకా తాగిన ముసలయ్య అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు ఎస్ఐ మహమ్మద్ గౌస్, సిబ్బంది వెంటనే వెళ్లి ముసలయ్య మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించే సమయంలో టీడీపీ వర్గీయులు అడ్డుపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.