చిత్తూరు జిల్లా తిరుపతి మండలంలో పలు పంచాయతీల్లో వైసీపీకి చెందినవారు ఇద్దరికంటే ఎక్కువమంది అభ్యర్థులు సర్పంచ్స్థానానికి పోటీచేస్తున్నారు. అలాంటిచోట్ల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఓటుకు రూ.2వేల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజక వర్గాల్లో మాత్రం ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేస్తున్నారని వినికిడి. ఇక విందులు సాధారణమై పోయాయి. కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది