చిత్తూరు జిల్లాలో ఎన్నికల పరంపర మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు టీడీపీ ,వైసీపీ శ్రేణులు గొడవలు పడుతూనే ఉన్నారు..ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. విషయానికొస్తే.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు లో వైసిపి దాడులు దౌర్జన్యాలు అరాచకం పెరిగిపోతున్నాయి.వెదురుకుప్పం మండలం గంట వారి పల్లి పంచాయతీలో టిడిపి అభ్యర్థి యువరాజ్ పై దాడి చేయడం తో పాటుగాటీడీపీ కార్యకర్తల పైన దౌర్జన్యాలకు పాల్పడ్డారు.గుండాలుతో వైసిపి ఈ దాడులకు తెగ బడిందని టిడిపి శ్రేణులు ఆరోపించారు. పోలీసులు సైతం వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టిడిపి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.