పార్టీల మద్దతుతో గెలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 659 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 33 చోట్ల గెలుపొందారు. ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. మొత్తంగా 3,249 పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇందులో జిల్లాలో 454 స్థానాల్లో పోటీ జరగగా ఇప్పటివరకు 110 స్థానాల్లో వైసీపీ గెలుపొందగా, 10 స్థానాల్లో మాత్రం టీడీపీ గెలిచిందని తెలుస్తుంది. పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలియనున్నాయి..