కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ ప్లాంట్లో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని మరో సారి చర్చించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని అమిత్ షాకు అందించారు.స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యవహారం పై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.