టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓవర్ యాక్షన్ బెడిసికొట్టిందని, తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరికీ జనం చుక్కలు చూపించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.95 శాతం పైగా పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే ఇందుకు నిదర్శనమని, టీడీపీ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యిందని ఆయన విమర్శించారు.అధికారం పోయాక వ్యవస్థలపై కూడా పట్టు జారిపోవడం చంద్రబాబును తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో ఆయన ఆలోచన శక్తిని కూడా కోల్పోతున్నారు. ఎప్పుడూ ఏం చేస్తున్నాడో తెలియడం లేదు అంటూ మండిపడ్డాడు.