పెళ్ళైన ఓ యువతి పై ఓ మృగాడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతే కాదు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. అది కాస్త ఆమె భర్త కు తెలిసింది.. వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని రేవ్తీ ప్రాంతంలో జరిగింది.. నరేంద్ర జనవరి 2020లో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా.. ఆమెకు వివాహం జరిగిందని తెలుసుకుని అతడు గతేడాది డిసెంబర్లో నాటి వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడని చెప్పారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు మంగళవారు నాడు నిందితుడిని అరెస్టు చేశారు.. అతని దగ్గర నుంచి ఆ వీడియో ను తీసుకొని డిలీట్ చేశారు