మదనపల్లె లోని ఓట్లు లెక్కింపును తమ గ్రామంలోనే చేపట్టాలని కోళ్లబైలు గ్రామస్థులు డిమాండు చేశారు. శనివారం కోళ్లబైలు పంచాయతీలో ఎన్నికలు నిర్వహించారు. బయ్యారెడ్డి కాలనీలో, కోళ్లబైలులో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తికాగా అధికారులు బ్యాలెట్ బాక్సులను బయ్యారెడ్డి కాలనీలోని పోలింగ్ కేంద్రానికి వాహనాల్లో తరలించడానికి ఉపక్రమించగా.. గ్రామస్థులు అంగీకరిచలేదు. రోడ్డుపై వాహనాలను నిలిపి అడ్డుకొని రాత్రి 7 గంటల వరకు ధర్నా చేశారు..